Vijay Thalapathy: విజయ్ తీస్తున్న 66వ సినిమాపై భారీ అంచనాలు దళపతి విజయ్ సినిమా అంటేనే క్రేజ్. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తుంటారో, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంతగా ఎదురు చూస్తుంటారు. ఆయన సినిమాలు హిట్ ప్లాప్ లకు అతితం అనవచ్చు. అలాంటి నట్టు తాజాగా వరుస సినిమాలతో టాలీవుడ్ లో వసూళ్లు కొలగొట్టడానికి సిద్ధం అవుతున్నారు. పొంగల్ కు తమిళంతో పాటు తెలుగు మలయాళం తదితర భాషల్లో రిలీజ్ కు సిద్ధమవుతోంది.
దీంతో విజయ్ నటిస్తున్న ఆయన 66వ సినిమా పైన ఇప్పటినుంచే సినీ వర్గాల్లో అంజనాలు పెరిగిపోతున్నాయి. కారణం విజయ్ మాత్రమే కాదు డైరెక్టర్ లోకేష్ కనకరాజు కూడా. ఈ దర్శకుడు చేసింది నాలుగే సినిమాలైనా లేటెస్ట్ గా కమలహాసన్ కథానాయకుడిగా తెరకెక్కించిన విక్రమ్ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. తాజాగా నటుడు విజయ్ తో సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు.
వీరి కాంబినేషన్ లో అంతకుముందు రూపొందిన మాస్టర్ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా క్రేజీ కాంబినేషన్ లను పరిశీలించడం లో లోకేష్ కనకరాజు దిట్ట. ఇప్పుడు విజయ్ హీరోగా చేస్తున్న స్పెషలు అంతకుమించి ఉంటుందని తెలుస్తుంది.
ఇందులో విజయ్ ముంబాయి డాన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్, నటుడు విశాల్ విలన్లు గా నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఉలగ నాయకుడు కమల్ హాసన్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నట్లు వార్త వైరల్ అవుతోంది.
ఇకపోతే నటి త్రిష కథానాయకుడిగా ఇదివరకే ఎంపికయ్యారట.సెవెస్ స్క్రీన్ స్టూడియో పతకంపై లాలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభానికి ముందు వ్యాపార పరంగాను ప్రకంపనులు సృష్టిస్తోంది. సినీ శాటిలైట్ హక్కులను సన్ ఫొటోస్ సంస్థ, డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. సినీ ప్రీ ప్రొడక్షన్స్ వేడుకల్లో దర్శకుడు లోకేష్ కనకరాజు బిజీగా ఉన్నారు. డిసెంబర్ నెలలో ఈ సినిమా వివరాలను అధికారం గా వెల్లడించనున్నారు.