Telugu Heros: రెండు ,మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు గాని అందులో ఏవి హిట్? ఏవి ఫ్లాప్?

ప్రతి సంవత్సరం తన అభిమానులను రెండు మూడు సినిమాలతో ఎంటర్టైన్ చేయాలి అని ప్రతి హీరో కూడా అనుకుంటారు. అందరి హీరోలకు వీలుపడదు. ప్రతి సంవత్సరం విషయం పక్కన పెడితే, ఈ సంవత్సరంలో అయితే ప్రతి హీరో కూడా రెండు ,మూడు సినిమాలు తో తన అభిమానులను ఎంటర్టైన్ చేశాడు.

అవి హిట్ కానీ, హిట్ కాకపోయినా రెండు మూడు సినిమాలతో ప్రతి హీరో కూడా పలకరించాడు. అలా చేసిన హీరోలు ఎవరు? ఆ చిత్రాలు ఏంటి? ఏవి హిట్ అయ్యాయి? ఏవి హిట్ కాలేదు? అనే విషయాలు తెలుసుకుందాం.

సీనియర్ హీరోలు
సీనియర్ హీరోల విషయానికొస్తే, అక్కినేని నాగార్జున ఈ సంవత్సరం మూడు సినిమాలతో తన అభిమానులను ఎంటర్టైన్ చేశాడు.” వైల్డ్ డాగ్”నెక్స్ట్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్స్ లో వచ్చిన బంగార్రాజు మూవీ కూడా బాగా హిట్ అయింది. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో”ది గోస్ట్”మూవీ దసరా కానుకగా విడుదలయ్యి ప్రేక్షకులను అకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. అదేవిధంగా బాలీవుడ్ లో ఒక కీలకమైన పాత్రలో బ్రహ్మాస్త్రం మూవీలో నటించాడు నాగార్జున.

రెండు ,మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు గాని అందులో ఏవి హిట్? ఏవి ఫ్లాప్?

2019 తర్వాత ఈ సంవత్సరంలోనే చిరంజీవి “ఆచార్య “మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం అంతగా హిట్ కాలేదు. నెక్స్ట్” గాడ్ ఫాదర్ “మూవీ ద్వారా అందుకున్నాడు చిరంజీవి. నెక్స్ట్ వెంకటేష్ విషయానికొస్తే” ఎఫ్ 3″,”ఓరి దేవుడా”సినిమాలో అతిథి పాత్రలో నటించి అభిమానులను ఎంటర్టైన్ చేశాడు వెంకటేష్

. మాస్ మహారాజా రవితేజ విషయానికి వస్తే ఆయన నటించిన రెండు సినిమాలు ఇప్పటికీ విడుదలయ్యాయి “ధమాకా “అనే మూవీ డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీస్ అనుకున్నంత హిట్ కాలేదు.

జూనియర్ హీరోలు-
జూనియర్ హీరోల విషయానికొస్తే రామ్ చరణ్ తేజ్ అయితే 2019లో ఆయన చేసిన “వినయ విధేయ రామ” మూవీ అంతగా పేరు తీసుకురాలేదు. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ తో నటించిన “ఆర్ ఆర్ ఆర్ “మూవీ కోవిడ్ ప్రభావం వల్ల కొంత వాయిదా పడిన అప్పటికి తర్వాత రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ని బద్దలు కొట్టింది.

ప్రపంచంలోనే సరికొత్త రికార్డును సృష్టించింది ఈ మూవీ. అలాగే “ఆచార్య” మూవీలో రామ్ చరణ్ తన తండ్రి పక్కన నటించి కూడా అభిమానులను ఎంటర్టైన్ చేశారు. ఇక హీరో నాగచైతన్య విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ “లవ్ స్టోరీ”బాగానే హిట్ అందించింది.

2022లో “బంగారు రాజు” అనే మూవీ ద్వారా అభిమానులను బాగానే ఎంటర్టైన్ చేశాడు. నెక్స్ట్ చేసిన” థాంక్యూ”మూవీ ఫెయిల్ అయింది. బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. హీరో రానా విలన్ గా నటించిన” భీమ్లా నాయక్ “మూవీ బాగానే హిట్ అయింది. రానా హీరోగా చేసిన” విరాటపర్వం “మూవీ అనుకున్నంత హిట్ కాలేదు.

అలాగే 1945 అనే మూవీ కూడా అంతగా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఇక హీరో శర్వానంద్ విషయానికొస్తే “ఆడాళ్లు మీకు జోహార్లు”సరిగా మెప్పించలేకపోయింది అభిమానులను. నెక్స్ట్ తీసిన “ఒకే ఒక జీవితం”శర్వానంద్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఇక హీరో వరుణ్ తేజ్ విషయానికొస్తే “గని”మూవీ అంతగా సక్సెస్ కాలేదు. ఇక ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా వస్తున్నా ఎఫ్ 3 బాగానే హిట్ అందుకుంది.

హీరో విశ్వక్ సేన్ నటించిన”అశోక వనంలో అర్జున కళ్యాణం”తనలోని ఒక కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసి హిట్ టాక్ నీ అందుకుంది. నెక్స్ట్ తీసిన “ఓరి దేవుడా”మూవీ ద్వారా కూడా బాగానే ఎంటర్టైన్ చేశాడు. ఇక హీరో నిఖిల్ విషయానికొస్తే “కార్తికేయ 2″తొలి పాన్ ఇండియన్ మూవీ అందరిని బాగానే అలరించింది. నెక్స్ట్ నిఖిల్ నటించబోతున్న సినిమా సూర్య ప్రతాప్ డైరెక్షన్స్ లో రాబోతుంది.” 18 పేజెస్”అనే టైటిల్ తో ఈ మూవీ తెరకక్కనుంది. ఈనెల 23వ తేదీ రిలీజ్ కానుంది.