Aparna Balamurali: తాజాగా ఓ కాలేజీలో చేదు అనుభవం చవి చూసిన అపర్ణా బాలమురళి

ఆకాశం నీ హద్దురా అనే మూవీ ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది అపర్ణ బాలమురళి. రీసెంట్ గా ఓ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమెకు ఒక చేదు అనుభవం కలిగింది.”సూరారై పోట్రూ”మూవీ ద్వారా జాతీయ నటిగా గుర్తింపు పొందింది.

ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక కళాశాలకు వెళ్లిన ఆమెతో ఓ స్టూడెంట్ అనుచితంగా ప్రవర్తించడం జరిగింది. ఈ సిచువేషన్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ స్టూడెంట్ ప్రవర్తన గురించే మాట్లాడుతున్నారు. అపర్ణ బాలమురళి ఓ ముఖ్యమైన పాత్రలో రీసెంట్ గా నటించిన మూవీ”తన్కమ్”. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా అపర్ణ బాలమురళి, తన తోటి నటుడైన వినీత్ శ్రీనివాసన్ తో కలిసి కేరళలోని ఒక కాలేజీకి వెళ్లి అక్కడ సందడి చేసింది.

తాజాగా ఓ కాలేజీలో చేదు అనుభవం చవి చూసిన అపర్ణా బాలమురళి
తాజాగా ఓ కాలేజీలో చేదు అనుభవం చవి చూసిన అపర్ణా బాలమురళి

అపర్ణ స్టేజ్ పై ఉన్నప్పుడు అక్కడికి ఓ స్టూడెంట్ వచ్చే ఆమెకి షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఆమె చేయి పట్టుకుని లాగి బలవంతంగా నిల్చమని చేసాడు. ఇలా చేయడం వల్ల ఆమె తప్పక నిలబడింది. నిలబడిన తర్వాత ఆ స్టూడెంట్ ఆమె భుజంపై చేయి వేయబోయాడు.

ఇలా చేయడం వల్ల ఆమె ఆ స్టూడెంట్ నుంచి దూరంగా వెళ్ళింది. ఈ సిచువేషన్ పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తద్వారా స్టూడెంట్ మళ్ళీ స్టేజి పైకి వచ్చి ఆమెకి సారీ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ సిచువేషన్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ స్టూడెంట్ ప్రవర్తనని తప్పుపడుతూ, ఎదుటివారితో ఎలా ప్రవర్తించాలి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. చేసిన తర్వాత క్షమాపణలు చెప్తే ఆ చేసిన పని మాయం కాదు కదా అంటూ ప్రశ్నించారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker