Anil Kumar Yadav: వరద నీటి ద్వారా రాయలసీమ ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులు నింపుతాం

అవుకు టన్నెల్ మరియు జిఎన్ ఎస్ ఎస్ లైనింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన వరద నీటి ద్వారా రాయలసీమ ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులు నింపుతాం: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పి.అనిల్ కుమార్

కర్నూలు, జిల్లాలోవరద నీటి ద్వారా రాయలసీమ ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులు నింపుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పి.అనిల్ కుమార్ అన్నారు.
ఆదివారం రాత్రి జి ఎన్ ఎస్ ఎస్ లైనింగ్ పనులను మరియు అవుకు టన్నెల్ లో జరుగుతున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్భంగా మీడియాతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పి.అనిల్ కుమార్ మాట్లాడుతూ జి ఎన్ ఎస్ ఎస్ లైనింగ్ పనులను పరిశీలించడం జరిగిందని పనులు మరింత పురోగతి చెందేలా చూస్తున్నామన్నారు. కెనాల్ కెపాసిటీని 80 వేలకు పెంచడం జరిగిందని, వచ్చే సంవత్సరం కల్లా లైనింగ్ పనులను పూర్తి చేస్తామని అన్నారు. అవుకు టన్నెల్ లో జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని అందులో మట్టి తీసే పనులు జరుగుతున్నాయన్నారు. ఆవుకు టన్నెల్ లో మట్టిని పూర్తిగా తొలగించి, పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఆవుకు టన్నెల్ పనులను పూర్తి చేసి టన్నెల్ ద్వారా పదివేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తామన్నారు. మనకు కేటాయించినటువంటి నీటిని, వరద సమయంలో వచ్చిన నీటిని రాయలసీమ ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులను నింపుకునేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గారి వెంట ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి, బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్టు మురళి నాథ్ రెడ్డి, ఎస్ ఈ చెంగయ్య కుమార్, ఈఈ సంజీవ్ చౌదరి, రాజశేఖర్ రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ ఈఈ కొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.