ఏపీలో ఇద్దరు IAS లకు జైలు శిక్ష విధించిన హైకోర్టు…ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు IAS officers పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరి లకు కు హైకోర్టు జైలుశిక్ష విధించింది. ఎన్నిసార్లు ఆదేశించిన హైకోర్టు ఉత్తర్వులను లెక్క చేయకపోవడంతో సహనం నశించిన హైకోర్టు చివరికి శిక్ష విధించింది.

హైకోర్టు తమ ఆదేశాల అమలు చేయాల్సిన బాధ్యత లో ఉండి నిర్లక్ష్యం ప్రదర్శించిన, చిరంజీవి చౌదరి, పూనం మాలకొండయ్య లకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ నెల 29న శిక్షను ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం హార్టికల్చర్,సెరికల్చర్ కమిషనర్ గా చిరంజీవి చౌదరి ఉన్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా పూనం మాలకొండయ్య ఉన్నారు. Punam మాలకొండయ్య కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమెకు వారెంట్ జారీ చేశారు.

విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఉద్యాన శాఖ 2020 జనవరి 10వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. అదే నెలలో సవరణ నోటిఫికేషన్ జారీ చేసి గతంలో నిర్దేశించిన పలువురు అర్హతలను తొలగించింది. దీన్ని సవాల్ చేస్తూ S.కృష్ణ, మరో 35 మంది అభ్యర్థులు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు. సవరణ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. పిటిషనర్ల కు పోస్టుల భర్తీలో అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కానీ అమలు చేయలేదు. Highcourt ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో అభ్యర్థులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉద్దేశపూర్వకంగానే అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని తేల్చారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker