Sports News

World Cup: టోర్నమెంట్ లో మొదటి బంతికే వికెట్ తీసిన బౌలర్లు.

టోర్నమెంట్లో మొదటి బంతికే వికెట్ తీసిన బౌలర్లు:

#world Cup:వన్డే, T20 వరల్డ్ కప్ లలో తన మొదటి బంతికే వికెట్ తీయాలని ప్రతి బౌలర్ కోరుకుంటారు. అలాంటి కోరికలు అంతర్జాతీయంగా నలుగురి బౌలర్లు తీర్చుకున్నారు. సాధారణంగా జరిగే టోర్నమెంట్ మ్యాచ్ లలో, మొదట బంతికే వికెట్ తీయడం కన్నా, ప్రపంచ కప్ లో మొదటి బంతికే వికెట్లు తీయడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అటువంటి నలుగురు బౌలర్లను పరిశీలిద్దాం.

ఇయాన్ హార్వే:

2003 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు చెందిన ఇయాన్ హర్వే ప్రపంచ కప్ లో తన మొదటి బంతికే వికెట్ తీశాడు. హర్వే తన మొదటి బంతికే పాకిస్తాన్ కు చెందిన సలీం ని అవుట్ చేసి, ప్రపంచ కప్ లో మొదటి బంతికే వికెట్ తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 310 పరుగుల భారీ స్కోర్స్ సాధించారు. సైమండ్స్ సెంచరీ తో ఆస్ట్రేలియా భారీ స్కోర్స్ సాధించింది.

ఇయాన్ హార్వే

311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 229 పరుగులు చేయగలిగింది. 22 పరుగులు తేడాతో ఆస్ట్రేలియ ఈ మ్యాచ్ లో గెలిచింది.

మలాచి జోన్స్:

2007 ప్రపంచ కప్ లో బెర్నుడాకు చెందిన మలాచి జోన్స్ తన మొదటి బంతికే వికెట్ తీసి మొదటి బంతికి వికెట్ తీసిన రెండవ బౌలర్ గా నిలిచాడు. బెర్నోడా మరియు భారత్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో జోన్స్ తన మొదటి బందుకే రాబిన్ ఉతప్పన్ ను అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో వీరేంద్ర సెహ్వాన్ 87 బంతుల్లో 114 పరుగులు చేశాడు. గంగూలీ 114 బంతుల్లో 89 పరుగులు చేయడంతో భారత్ 413 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

414 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెర్నుడాను కేవలం 156 పరుగులకే అలౌట్ చేశారు. 257 పరుగుల భారీ తేడాతో భారత్ గెలిచింది.

విజయ్ శంకర్:

2019 ప్రపంచ కప్ లో భారత్ కు చెందిన విజయశంకర్ తన మొదటి బంతికే వికెట్ తీసి, ప్రపంచకప్ లో మొదటి బంతికే వికెట్ తీసిన మూడవ బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విజయ శంకర్, పాకిస్తాన్ ఓపేనర్ ఇమామ్ ఉల్ హక్ ను LBW   గా అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ గాయం కారణంగా అతని ప్లేస్ లో విజయశంకర్ బౌలింగ్ వేసి తన మొదటి బంతికే వికెట్ తీశాడు. రోహిత్ శర్మ 113 బంతుల్లో 140 పరుగులు చేయడంతో భారత్ 336 పరుగుల భారీ పోస్ట్ చేసింది. బారి లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ DRS పద్ధతిలో ఈ మ్యాచ్ లో భారత్ పై ఓడిపోయింది.

అర్షదీప్ సింగ్:

ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్కు చెందిన యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ 2022 అక్టోబర్ 23న జరిగిన పాకిస్తాన్ తో జరిగిన, టి20 వరల్డ్ కప్ లో తన మొదటి ఓవర్ మొదటి బంతికే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ను LBW గా అవుట్ చేసి, ప్రపంచ కప్ లో మొదటి బంతికే వికెట్ తీసిన నాలుగవ బౌలర్ గా రికార్డు సృష్టించాడు.

టాస్ గెలిచి భారత్, కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ ఓపెనర్లు బాబర్, అజాం పెద్దగా రాణించలేదు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మజీద్, అహ్మద్ లు అర్థ సెంచరీలతో రాణించటంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగుల స్కోర్ సాధించింది. భారత బౌలింగ్ లో హర్షదీప్ మూడు వికెట్లు, హార్దిక్ పాండే 3 వికెట్లు సాధించారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button
Exit mobile version