ఆంధ్ర యూనివర్సిటీలో మెడికల్ కోర్సులు
ఆంధ్ర యూనివర్సిటీలో మెడికల్ కోర్సులు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ వారు పీజీ మరియు పీజీ డిప్లొమా ప్రోగ్రామ్లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ని బొల్లినేని మెడ్‌స్కిల్స్ సహకారం అందిస్తుంది. ప్రతిభ, కౌన్సిలింగ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్:
కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు. ఇందులో 40 సీట్లు కలవు. గుర్తింపు గల యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ఫీజు 45 వేల రూపాయలు.
పీజీ డిప్లొమా:
కోర్సు వ్యవధి ఒక సంవత్సరం. ఇందులో గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ/ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ /క్రిటికల్ కేర్ టెక్నాలజీ స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు. ఒక్కో దానిలో 15 సీట్లు కలవు.బీడీఎస్ /ఎంబీబీఎస్ /బీఫార్మసీ/ బీఎస్సీ (నర్సింగ్)/ బీఏఎంఎస్ /బీహెచ్ఎంఎస్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ఫీజు 50 వేల రూపాయలు.
వివరాలు:
-వయస్సు: దరఖాస్తు చేయు నాటికి 20 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
-దరఖాస్తు ఫీజు: రూ. 250/-
-దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 15
-కౌన్సిలింగ్ తేదీ: అక్టోబర్ 25
-అడ్రస్: డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగరం పాలెస్, పెద వాల్తేర్, విశాఖపట్నం-530003.
-అధికారిక వెబ్సైట్: www.audoa.in