govt order
ఈ-ఓటింగ్ యాప్ ఇంటి దగ్గర నుంచే ఓటు
ఈ-ఓటింగ్ యాప్ ఇంటి దగ్గర నుంచే ఓటు
ఓటింగ్ విధానం లో సరికొత్త రూపకల్పనల దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటి దగ్గర నుంచే ఓటు వేసేలా అత్యాధునిక పరిజ్ఞానంతో ఈ ఓటింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టబోతున్నారు. మొబైల్ లోనే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఓటు వేసే సాంకేతిక ప్రక్రియ తయారవుతోంది. తెలంగాణ ఐటీ శాఖ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, బొంబాయి ఐఐటి, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ విభాగం సీడాక్, భిలాయ్ ఐఐటీల ప్రొఫెసర్ల సంయుక్త కార్యాచరణ లో ఈ-ఓటింగ్ యాప్ తయారవుతుంది. మొదట కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా పరిశీలించి, ఆ తర్వాత తుది ఆమోదం పొందుతుంది.