జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు
మోడరేట్ గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు.
ఫిజిక్స్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎక్కువ ప్రశ్నలు.
మ్యాథ్స్, కెమిస్ట్రీలో ఇంటర్ రెండేళ్ల సబ్జెక్ట్ కు ప్రాధాన్యం.
10వ తేదీన ప్రాథమిక కీ, 15వ తేదీన తుది ఫలితాలు.
16వ తేదీ నుంచి జేఈఈ కౌన్సిలింగ్.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) లో ప్రవేశానికి సంబంధించి ఆదివారం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్డ్ 2021 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం పేపర్1, మధ్యాహ్నం పేపర్2 పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు అర్హత సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1.5 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. ఏపీ నుంచి 15 వేల మందిలో 90% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో 30 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.
ఫైనల్ కీ 15వ తేదీన
పరీక్ష రాసిన అభ్యర్థులు రెస్పాన్స్ షీట్ లో సంబంధిత వెబ్ సైట్ లో ఈ నెల 5వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రాథమిక కీ ప్రకటిస్తారు. 10 మరియు 11 వ తేదీలలో ప్రాథమిక కీ పై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం అనంతరం అక్టోబర్ 15వ తేదీన ఫైనల్ కీ, తుది ఫలితాలు విడుదల చేస్తారు.
కౌన్సిలింగ్ అక్టోబర్ 16వ తేదీ నుంచి
దేశంలో గల 23 IITలు, 31 NITలు, 26 IIITలు, 29 ఇతర గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లలో ప్రవేశాల కొరకు జేఈఈ కౌన్సిలింగ్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ లో మెరిట్ సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ లో ఇచ్చే వెబ్ ఆప్షన్ లను బట్టి వారి ర్యాంక్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది.