నీట్-జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ఫలితాలు
నీట్-జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ఫలితాలు
రెండు వారాల వ్యవధిలో కౌన్సిలింగ్ ప్రారంభం
హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబిబిఎస్, బిడిఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించిన neet- 2021( జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష )ఫలితాలు రెండు మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడిన రెండు వారాల వ్యవధిలో కౌన్సిలింగ్ ప్రారంభించేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం లో ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనార్టీ వైద్యా కళాశాలల్లో కలిసి మొత్తం 5040 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కళాశాలలో 1740 ఉండగా. వీటిలో అఖిలభారత కోటాలో 467, ఐఎస్ఎ నుంచి 50 సీట్లు భర్తీ అవుతాయి. అంటే మొత్తంగా 517 అఖిలభారత కోటకు రాష్ట్రం నుంచి చేరుతాయి. మిగిలిన ప్రభుత్వం కళాశాలలో సీట్లను, ప్రైవేట్ కళాశాలలో ని 50% సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు.
ఏపీ విద్యార్థులు తెలంగాణలో తెలంగాణ విద్యార్థులు ఏపీ లో అన్ రిజర్వడ్ కోటాలో దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో నిర్వహించిన neet 2021 కు సుమారు 16 లక్షల మంది అభ్యర్థులు హాజరు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నీటు కు తెలంగాణ నుంచి 59,069 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 59,951 మంది దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే నీట్ ఫలితాలు వెళ్లవడునున్న నేపథ్యంలో తమకు వచ్చే ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందో అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అంచనా వేసుకుంటున్నారు. గత ఏడాది కేటగిరీల వారీగా ఎంబిబిఎస్ సీట్లు పొందిన వారి ర్యాంకులను పరిశీలిస్తున్నారు.