govt order
పాన్-ఆధార్ అనుసంధానం చివరితేదీ 2022 మార్చి 31
పాన్-ఆధార్ అనుసంధానం చివరితేదీ 2022 మార్చి 31
కేంద్ర ప్రభుత్వం శాశ్వత ఖాతా నెంబర్ ( పాన్) తో ఆధార్ అనుసంధానం ఆధార్ చేయడానికి మార్చి 31, 2022 వరకు గడువు పెంచింది. గతంలో నిర్ణయించిన గడువు ఈ నెల చివరతో ముగియనుంది. కరోనా సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా మరో 6 నెలలు అవకాశం ఇస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (CBDT) శుక్రవారం తెలిపింది.
అంతేకాకుండా IT చట్టం లో భాగంగా పెనాల్టీ ప్రొసీడింగ్స్ ను పూర్తిచేయడానికి గడువును ఈ నెల 30 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు పొడిగించింది. బినామీ ఆస్తుల లావాదేవీల నిరోధక చట్టం,1988 లో భాగంగా తీర్పు ఇచ్చే అధికారి నోటీసులు, ఆదేశాల జారీకి కాలపరిమితిని కూడా వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు CBDT తెలియజేసింది.