admissionjee

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అక్టోబర్ 3, 2021

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అక్టోబర్ 3, 2021

03-10-2021 తేదీన జరగబోయే పరీక్ష కు తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 25 వేల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను రాసేవారు పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లి, పరీక్ష రాయాల్సిన గది ఎక్కడ ఉందో అని చూడాల్సిన అవసరం లేకుండా మీ హాల్టికెట్ లో ఉన్న బార్కోడ్ ను అక్కడ సిబ్బందికి చూపిస్తే వారు స్కాన్ చేసి పరీక్ష రాయాల్సిన గదిని లేదా కంప్యూటర్ల వివరాలను తెలుపుతారు. దేశవ్యాప్తంగా ఆదివారం (ఈ నెల 3న) జేఈఈ అడ్వాన్స్ పరీక్ష జరుగుతుంది. విద్యార్థుల కోసం కంప్యూటర్ వద్ద రఫ్ వర్క్ నోట్ బుక్ ఉంచుతారు. మధ్యాహ్నం పేపర్-2 పరీక్ష ప్రారంభమైన తర్వాత హాల్టికెట్ మరియు కోవిడ్ కు సంబంధించిన స్వీయధ్రువీకరణ పత్రాన్ని ఇన్విజిలేటర్లకు ఇవ్వవలసి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష (పేపర్-1,2 కలిపి) కు మొత్తం ఎన్ని మార్కులకు, ఎన్ని ప్రశ్నలు ఉంటాయని ముందుగా తెలియకపోవడం ఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రత్యేకత.

16 వేల సీట్లు, 1.70 లక్షల మంది పోటీ

జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి దాదాపుగా 25 వేల మంది విద్యార్థులు హాజరు అవుతారు. తెలంగాణ రాష్ట్రం నుండి 14 వేల మంది, ఏపీ నుండి 30 వేల మంది పాల్గొంటారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు రాయడానికి దేశవ్యాప్తంగా 2.50 లక్షల మంది అర్హత సాధించగా, 1.70 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు దేశంలోని 23 ఐఐటీలో బీటెక్ సీట్లకు పోటీ పడవచ్చు. గత సంవత్సరం 16,061 సీట్లు అందుబాటులో ఉండగా ఈసారి కనీసం మరో ఐదు వందల వరకు పెరగవచ్చు. ఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను అక్టోబర్ 15వ తేదీన వెల్లడిస్తామని ఖరగ్‌పూర్ వారు ప్రకటించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button