Navodaya Online Application submission Last Date Extended
15 వరకు నవోదయ దరఖాస్తులు
జవహర్ నవోదయ విద్యాలయంలో (2020-23) 6వ తరగతి ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 15 వరకు పొడిగించారు. ఈ మేరకు నవోదయ విద్యాలయ సమితి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో అయిదో వ తరగతి చదువుతూ, 2009, మే 1 నుంచి 2013, ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో http:/navgdaya.gov.in/nvs/en/admission-jnvst-class/www.navodaya.gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఏడాది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు అప్లోడ్ చేస్తే ధ్రువపత్రం (సర్టిఫికెట్) పై కచ్చితంగా తాము చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయుడి తో సంతకం చేయించుకోవాలనే నిబంధన తాజాగా విధించారు. ఇప్పటికే అప్లోడ్ చేసిన విద్యార్థులు సదరు సర్టిఫికేట్ పై ప్రధానోపాధ్యాయుని సంతకం, పాఠశాల సీలు వేయించుకుని నవోదయ పాఠశాల కార్యాలయంలో అందజేయాలి.