అగ్రిసెట్ కౌన్సిలింగ్ 11వ తేదీకి వాయిదా
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రిసెట్ 2021 అభ్యర్థులకు వ్యవసాయ BSC (హానర్స్) కోర్సులో ప్రవేశాలు కల్పించడానికి ఈ నెల 8 ఏర్పాటుచేసిన కౌన్సిలింగ్ 11వ తేదీకి వాయిదా వేసినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ గిరిజన కృష్ణ గారు ఓ ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ ముందుగానే నిర్వహిస్తుండడంతో అభ్యర్థులకు ఇబ్బంది కలగకూడదని వాయిదా వేశాం అని తెలిపారు.