AP పాలిసెట్ ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి
AP పాలిసెట్ ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి
కౌన్సిలింగ్ కు హాజరైన 3 వేల మంది విద్యార్థులు
AP పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న పాలీసెట్ ధ్రువీకరణ పత్రాల పరిశీలన గురువారంతో ముగిసింది. ఈ నెల 3వ తేదీ నుండి చేపట్టిన ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు దాదాపు 3 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. బుధవారము జిల్లావ్యాప్తంగా 1000 మంది విద్యార్థులు వరకు హాజరయ్యారు. అనంతపురం తో పాటు హిందూపురం కళ్యాణదుర్గం పట్టణంలో పాలీసెట్ కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 90% మంది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ కేంద్రానికి విద్యార్థులు వచ్చారు. దీంతో విద్యార్థులతో కేంద్రం కిటకిటలాడుతోంది. గురువారంతో ధ్రువీకరణ పత్రాలు పరిశీలన ముగియనుండటంతో విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశముందని ప్రిన్సిపల్ తెలిపారు.
ఒకేషనల్ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాల అవకాశం
ఇంటర్ ఒకేషనల్ బ్రిడ్జి కోర్స్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జయచంద్రారెడ్డి గారు తెలిపారు. ఈ విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం లో చేరుతున్నారు. అర్హత గల విద్యార్థులు ఈ అక్టోబర్ 8వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం
http://apsbtet.in/ivc, www.dteap.nic.in వెబ్ సైట్ ను సందర్శించాలని అని సూచించారు.