డిప్యూటీ డీఈవోల, ఎంఈవోల సంఖ్య రెట్టింపు
డిప్యూటీ డీఈవోల, ఎంఈవోల సంఖ్య రెట్టింపు
-ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ
-ఆర్థిక శాఖ దగ్గర పెండింగ్ లో ఉన్న ఫైల్
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో భారీ మార్పులను తీసుకురాబోతుంది. ప్రతి మండలానికి ఇద్దరు మండల విద్యాశాఖ అధికారులు (MEO), ప్రతి విద్యాశాఖ డివిజన్ పరిధిలో ఇద్దరు ఉప విద్యాశాఖ అధికారులు (Dy.DEO) లను ఏర్పాటు చేయడానికి విద్యా శాఖ వారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఆర్థిక శాఖ వద్ద ఫైల్ పెండింగ్ లో ఉన్నది. పంచాయితీ, ప్రభుత్వ ఉపాధ్యాయుల మధ్య సంవత్సరాల తరబడి ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్ అంశం పెండింగ్ లో ఉంది. ఈ సమస్యను పరిష్కరించే విధంగా కొత్త సర్వీస్ రూల్స్ తీసుకురావాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ప్రస్తుతం ఎంఈవో, డిప్యూటీ డీఈఓ ల సంఖ్యను రెట్టింపు చేయాలని విద్యాశాఖ ఆలోచిస్తుంది.
దీని వలన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తే ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య తీరిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎంఈఓ పోస్టులు పొందుతున్నారు. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే మరొకరి ఎంఈవో హోదా వచ్చే అవకాశం ఉంది. వారికి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ పాఠశాలలకు అప్పగించాలని భావిస్తోంది. పంచాయతీ టీచర్లకు జిల్లా, ప్రాథమిక పరిషత్ పాఠశాలలను అప్పగించాలని ప్రతిపాదన చేసింది.
ఒక ఎంఈవో పరిధిలో కనీసం 50 స్కూల్స్ ఉండేలా విద్యాశాఖ ఆలోచన చేస్తోంది. ఒకవేళ మండల పరిధిలో 50 స్కూల్స్ లేకపోతే మరో మండల పరిధిలోని స్కూల్లను కూడా కలిపి అప్పగించాలని భావిస్తుంది. కొన్ని పోస్టులను రద్దు చేయాలనుకుంటుంది. ఆర్థిక భారం తగ్గడానికి డ్రాయింగ్, క్రాఫ్ట్ పోస్టులను రద్దు చేసే విధంగా విద్యాశాఖ ఆలోచిస్తుంది.
రాష్ట్రంలో 48 విద్యాశాఖ డివిజన్ల పరిధిలో 48 మంది డిప్యూటీ డిఈవోలు ఉన్నారు. ఇందులో ఒకే ఒక డిప్యూటీ డిఇఓ రెగ్యులర్ పద్ధతిలో ఉన్నారు. మిగతా 47 ఇన్చార్జి లతోనే నడిపిస్తున్నారు. రాష్ట్రంలో 664 మంది ఎంఈఓ లు ఉన్నారు. ఇందులో 98 మంది మాత్రమే రెగ్యులర్ పద్ధతిలో పనిచేస్తున్నారు. మిగతా 566 పోస్టులు ఇన్చార్జి లతోనే కొనసాగిస్తున్నారు.