andhra pradesh

AP LIP Program in Government Schools

AP LIP Program in Government Schools

తూ.గోదావరి జిల్లా, ప.గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు

ప్రభుత్వ పాఠశాలలో భాష అభివృద్ధి కార్యక్రమాన్ని (లిప్) ప్రారంభించేందుకు పాఠశాలలో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. తూ.గోదావరి జిల్లా, ప.గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా ఈ నెల 10వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 100 రోజుల పాటు విద్యార్థులకు ఆయా తరగతుల వారీగా రోజుకు కొన్ని పదాలను తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో నేర్పిస్తారు. 1,2 తరగతులకు రోజుకు రెండు, 3 – 5 వారికి మూడు పదాలు తెలుగు, ఆంగ్లం పరిచయం చేస్తారు. 6-10వ తరగతుల విద్యార్థులకు రోజుకు ఐదు పదాలు చోప్పున మూడు భాషల్లో నేర్పిస్తారు.
తరగతి లో పాఠం ప్రారంభించే ముందు ఆయా మాధ్యమాల ఉపాధ్యాయులు విద్యార్థులకు పదాలను నేర్పిస్తారు. ఇందుకోసం విద్యార్థులతో ప్రత్యేక ఇన్ నోట్ బుక్ ఏర్పాటు చేయించి, ముందు రోజున నేర్పిన పదాలను తరగతిలో పునశ్చరణ చేయిస్తారు. పిల్లలు 3 భాషలను నేర్చుకునేందుకు ఈ విధానాన్ని రూపొందించారు. ప్రతి 15 రోజులకోసారి పరీక్ష నిర్వహించి, మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారని వెల్లడించారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందిస్తామని, పాఠశాలకు విద్యార్థుల ప్రతిభ ఆధారంగా స్టార్ రేటింగ్ ఇస్తామని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button