govt order

AP PMC Election 2021: పేరెంట్స్ కమిటీ ఎన్నికల మార్గదర్శకాలు

పేరెంట్స్ కమిటీ ఎన్నికలు

ఈ నెల సెప్టెంబర్ 16వ తేదీన నోటిఫికేషన్, 22వ తేదీన ఎన్నిక, అదే రోజు అధ్యక్ష, ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఎన్నికల మార్గదర్శకాలు

హెచ్ఎం లే పాఠశాలలో ఎన్నికలు నిర్వహిస్తారు. 50% తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు కోరం రూపొందించే సమయం ను నిర్వహిస్తారు. నోటితో చెప్పే పద్ధతి, చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎన్నికలు ఉంటాయి. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే రహస్య ఓటింగ్ నిర్వహించబడుతుంది. పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు మాత్రమే ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హులు. ఎన్నికైన పీసీ కమిటీ సభ్యుల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో కనీసం ఒక ST/SC/BC మరియు మైనార్టీ వర్గాలకు చెందిన వారితో పాటు ఒకరు మహిళ అయి ఉండాలి. స్థానిక సంస్థలలో ఉన్న సభ్యులు, హెచ్ఎంలు ఓటింగ్లో పాల్గొనేందుకు అనర్హులు.

ఓటు హక్కు కలిగిన పేరెంట్స్ /గార్డెన్స్ కొత్తగా అవసరమైన తల్లిదండ్రుల కమిటీ సభ్యులను ఎన్నుకోవాలి. ఖాళీ అయిన సభ్యుల స్థానంలో కొత్తవారిని కూడా ఎన్నుకోవచ్చు. ఒకసారి ఎన్నికైనా పేరెంట్స్ కమిటీ ని ప్రాథమిక పాఠశాల మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎంఈఓ, ఇతర పాఠశాలల్లో డీఈఓ ల ఆదేశాల ప్రకారం రద్దు లేదా ఇతర పాఠశాలలో విలీనం చేసే వరకు కొనసాగుతాయి. 1km దూరంలో గల ప్రాథమిక పాఠశాలలు, 3km దూరంలోగల ఆవాస ప్రాంతాలను నైబర్హుడ్ ఏరియా ఆఫ్ స్కూల్స్ గా పేర్కొంటారు. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యం ఉండకూడదు. ఎన్నికలకు ఇబ్బంది కలిగించే వారు చట్టరీత్యా శిక్షార్హులు.

పరిశీలకులుగా తహసిల్దారు /ఎంపీడీవో /విలేజ్ కార్యదర్శి లేదా విఆర్వోలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారు. ఓటింగ్లో పాల్గొనాలనుకునే వారు ఓటింగ్ కోసం జారీ చేసిన సింపుల్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ప్రభుత్వం జారీ చేసిన ఇతర ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా కావాలి. లీడర్షిప్, డిసడ్వాంటేజెస్ సభ్యులు లేనప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఆధారంగా సభ్యులను ఎన్నుకోవచ్చు.


పేరెంట్స్ కమిటీ నిర్మాణ విధానం

ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వారిలో ఇద్దరు మహిళలు ఉండాలి. ముగ్గురిలో ఒకరు ఎస్సీ/ ఎస్టీ అయి ఉండాలి. మరొకరు బిసి ఉండాలి. కమిటీల్లో ఎన్నికైన సభ్యుల కాలపరిమితి రెండు సంవత్సరాలు లేదా ఆ సభ్యుల పిల్లలు ఆ పాఠశాలలో ఉన్నంత వరకు ఇందులో ఏది ముందయితే అది వారి కాలపరిమితి గా పరిగణించాలి.

ఎక్స్ అఫిషియో సభ్యులు:

హెచ్ ఎం లేదా ఇన్చార్జి హెచ్ ఎం(మెంబర్ కన్వీనర్), ఎంఈఓ చే నామినేట్ చేసిన అదనపు ఉపాధ్యాయ సభ్యులు, ఆ ప్రాంత కార్పొరేటర్ లేదా కౌన్సిలర్ వార్డు సభ్యుల యందు ఒకరు, నైబర్హుడ్ ఏరియా లో పనిచేసే వారు, హెల్త్ వర్కర్లు, అంగన్వాడీవర్కర్లు, గ్రామంలోని లేదా వార్డు లోని మహిళా సమైక్య ప్రెసిడెంట్.

కో ఆప్షన్ సభ్యులు:

స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, పెలాంతప్రిస్టులు, పాఠశాలకు చేయూతనిచ్చే వారి నుంచి ఇద్దరు సభ్యులను ఎన్నుకోవాలి. వీరి పదవీకాలం మొదటి మీటింగ్ నుంచి రెండు సంవత్సరాల పాటు ఉంటుంది.

లోకల్ అథారిటీ చైర్ పర్సన్స్ గా సర్పంచ్ లేదా మున్సిపల్ చైర్ పర్సన్ లేదా మేయర్లు ఆయా ప్రాంతాల్లో నిర్వహించే పీసీ కమిటీలకు హాజరు కావచ్చు.

కాల నిర్ణయం:

-సెప్టెంబర్ 16న అన్ని పాఠశాలలో హెచ్ ఎం లు ఉదయం 10 గం.లకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలి. మధ్యాహ్నం 2:00గంటల లోపు ఓటర్ల జాబితాను నోటీస్ బోర్డులో ప్రకటించాల్సి ఉంటుంది.
-సెప్టెంబర్ 20 వ తేదీ ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 లోపు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించాలి, పరిశీలించాలి. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల లోపు ఓటర్ల తుది జాబితాను పాఠశాల నోటీసు బోర్డులో ప్రకటించాలి.
-సెప్టెంబర్ 22 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1:00 లోపు ఎన్నికలు నిర్వహించి తల్లిదండ్రుల కమిటీ సభ్యుల జాబితా ప్రకటిస్తారు. మధ్యాహ్నం 1:30 గం.లకు పీసీ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక పూర్తి చేయవలసి ఉంటుంది. మధ్యాహ్నం 2:00 గం.ల నుండి 8:30 గం. ల మధ్య పీసీ కమిటీ తో ప్రమాణస్వీకారం పూర్తి చేసి సమావేశాన్ని నిర్వహించవలసి ఉంటుంది.

AP PMC Selection 2021 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరెంట్స్ మీటింగ్ కమిటీ నిర్వహణ సూచనలు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button