శానిటరీ న్యాప్కిన్ ల పంపిణీ కార్యక్రమం
శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ కార్యక్రమం
-పది లక్షల మంది బాలికలకు శానిటరీ న్యాప్కిన్ ల పంపిణీ
-రూ.31.48 కోట్ల వ్యయంతో స్వేచ్ఛ పథకం
అమరావతి: మహిళా, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛ పథకాన్ని అమలు చేస్తుంది. ప్రభుత్వం మహిళలు, బాలికల పరిశుభ్రత ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో పెద్ద ఎత్తున అవగాహన సదస్సు మహిళా శిశు సంక్షేమ శాఖ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛ పథకం ద్వారా రూ.31.48 కోట్ల వ్యయంతో కిశోర బాలికలకు ఈనెల నుంచి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న పాఠశాలలు ఇంటర్మీడియట్ కళాశాలల్లో చదువుతున్న సుమారు పది లక్షల మంది కిశోర బాలికలకు న్యాప్కిన్ లను అందిస్తారు. ఇలా ప్రతి రెండు నెలలకు ఒకసారి పదేసి న్యాప్కిన్ లను అందించడం జరుగుతుంది. రుతుక్రమం వల్ల పాఠశాలకు, కాలేజీకి రావడానికి ఇబ్బంది పడే వారి సంఖ్యను తగ్గించడం, వారి పరిశుభ్రతకు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.
విద్యాసంస్థల్లో ఒక మహిళ ఉపాధ్యాయురాలిని లేదా అధ్యాపకురాలిని నోడల్ అధికారిగా నియమించి న్యాప్కిన్ ల పంపిణీ చేస్తారు. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతిక శుక్ల గారు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ చేయూత స్టోర్ లలో నాణ్యమైన న్యాప్కిన్ లను తక్కువ ధరకే విక్రయించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.