andhra pradeshnotification

LNCPE లో ఫిజికల్ ఎడ్యుకేషన్

LNCPE లో ఫిజికల్ ఎడ్యుకేషన్

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (LNCPE)- బీపీఈడీ, ఎంపీఈ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. దేశవ్యాప్తంగా నిర్వహించే అడ్మిషన్ టెస్ట్ ద్వారా ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ):
కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు. 4 సెమిస్టర్లు ఉంటాయి. ఇందులో 50 సీట్లు కలవు. మహిళలకు 20 సీట్లు, పురుషులకు 30 సీట్లు కేటాయించారు. ఏదేని డిగ్రీలో ద్వితీయ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపిఈ):

కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు. ఇందులో 25 సీట్లు కలవు. కనీసం 50 శాతం మార్కులతో బీపీఈ/బీపీఈడీ/ బీఎస్సీ (పీఈ) ఉత్తీర్ణులు అర్హులు. దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు జూలై 1 నాటికి 25 ఏళ్లు మించకూడదు.

పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమామో ఇన్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మేనేజ్మెంట్ (PGDFHM):

కోర్సు వ్యవధి ఒక సంవత్సరం. రెండు సెమిస్టర్ లు ఉంటాయి. ఇందులో 20 సీట్లు కలవు. కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. జులై 1వ తేదీ నాటికికి అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించరాదు.

-దరఖాస్తు ఫీజు: రూ. 500/-

-ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: అక్టోబర్ 15వ తేదీ.

-ఎంపీఈ, PGDFHM అడ్మిషన్ టెస్ట్ తేదీ: అక్టోబర్ 26, 27వ తేదీలు.

-బీపీఈడీ అడ్మిషన్ టెస్ట్ తేదీ: అక్టోబర్ 28, 29వ తేదీలు.

-అధికారిక వెబ్సైట్: www.lncpe.gov.in

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button