Telangana

తెలంగాణ సాంఘిక సంక్షేమ విద్యాలయ సంస్థ నుండి ప్రిన్సిపాల్ మరియు టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

TSWREIS తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 268 విద్యాసంస్థలు (పాఠశాలలు, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలు) ఉన్నాయి. TSWRPC-తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫార్మసీ కాలేజ్ లో మొదటి సంవత్సరం బి.ఫార్మసీ కోర్సు కోసం ప్రిన్సిపల్ మరియు టీచింగ్ ఫ్యాకల్టీ స్థానాలకు దరఖాస్తులు ఆహ్వానించారు.
ఆసక్తి కలవారు ఆన్లైన్లో దరఖాస్తులు పూరించి సంబంధిత సర్టిఫికెట్లు మరియు డాక్యుమెంట్లను ధృవీకరించబడిన కాఫీలతో సంతకం చేసి హార్డ్ కాపీని “సెక్రటరీ TSWREIS కార్యాలయం, చాచా నెహ్రూ పార్క్ ఎదురుగా మాసాబ్ ట్యాంక్ హైదరాబాద్ నందు ఇవ్వాలి.

తేదీలు:

-ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం: 22-9-2021.

-ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 28-9-2021.

-TSWREIS ద్వారా హార్డ్ కాపీలను తీసుకోవడానికి చివరి తేదీ: 30-9-2021.

అర్హతలు:

ప్రిన్సిపాల్ పోస్ట్ కి:

ఏదైనా ఫార్మసీ సబ్జెక్టులలో పీహెచ్డీ డిగ్రీ తో (పీహెచ్డీ అర్హత తప్పనిసరిగా పీసీఐ గుర్తింపు కలిగి ఉండవలెను) బోధన లేదా పరిశోధనలో ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. ఫార్మసీ లేదా ఫార్మ్ యొక్క సంబంధిత శాఖలో ఫార్మసీ ( M.ఫార్మ్) లో మాస్టర్ డిగ్రీ తో మొదటి తరగతి B.ఫార్మ్ డి. అందులో ఐదు సంవత్సరాలు PCI ఆమోదం పొందిన కాలేజీలో హెచ్ఓడి/ ప్రొఫెసర్ గా ఉండాలి.

టీచింగ్ స్టాఫ్ కి:

ఫార్మసీలో మాస్టర్స్ డిగ్రీ (ఎం ఫార్మ్) ఫార్మసీ లో స్పెషలైజేషన్ (అర్హత తప్పనిసరిగా పిసి గుర్తింపు ఉండాలి).

జీతం:
బోధన మరియు పరిశోధన అనుభవం ఆధారంగా ప్రిన్సిపాల్ కు రూ. 60-70వేలు. లెక్చరర్ వారి బోధనా అనుభవం మరియు అర్హతలు ఆధారంగా 40-50 వేల వరకు.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.500/-

అధికారిక వెబ్సైట్: www.tswreis.in

ఆన్లైన్ అప్లికేషన్ డైరెక్ట్ లింక్: http//kishoremamilla-001-site10.itempurl.com/Start.html

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button