UPSC సివిల్ ప్రిలిమినరీ పరీక్షలు అక్టోబర్ 10న
UPSC సివిల్ ప్రిలిమినరీ పరీక్షలు అక్టోబర్ 10న
తిరుపతిలో 16 పరీక్ష కేంద్రాలు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ (యుపిఎస్ సీ) ఆధ్వర్యంలో పదవ తేదీన సివిల్స్ ప్రిలిమినరీ 2021 నిర్వహించనున్నారు. ఇందుకోసం తిరుపతిలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పకడ్బందీగా పరీక్షలను నిర్వహించేందుకు కలెక్టర్ హరి నారాయణ చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సివిల్స్ ప్రిలిమినరీ కి మొత్తం 7201 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు అధికారులు తెలియజేశారు. 10వ తేదీ ఉదయం 9:30 నిమిషాల నుండి 11:30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2:30 నిమిషాల నుండి సాయంత్రం 4:30 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షకేంద్రం లోనికి అనుమతించమని స్పష్టం చేశారు.
పరీక్ష కేంద్రాలు:
-శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల (వింగ్-ఏ & వింగ్ -బి).
-శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కాలేజ్ (వింగ్ -ఏ & వింగ్ -బి).
-శ్రీ పద్మావతి బాలికల హై స్కూల్.
-ఎస్వీయూ క్యాంపస్ హై స్కూల్ మరియు ఇంజనీరింగ్ కళాశాల.
-శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాల (వింగ్-ఏ & వింగ్ -బి).
-కేంద్రీయ విశ్వవిద్యాలయం.
-శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం.
-లిటిల్ ఏంజల్స్ హై స్కూల్.
-బాలాజీ కాలనీ లోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల (వింగ్ -ఏ).
-ఎస్వీ ఆర్ట్స్ కళాశాల (వింగ్-బి).
-మహతి ఆడిటోరియం సమీపంలోని ఎస్వి హై స్కూల్.