Sports News

David Warner: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పై ఫిర్యాదు చేసిన డేవిడ్ వార్నర్

David Warner: డేవిడ్ వార్నర్ తను నేరస్థుడు కాదని తనకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వమని క్రికెట్ బోర్డు కు ఫిర్యాదు చేసాడు.

2018 సంవత్సరంలో జరిగిన దక్షిణాఫ్రికా తో జరిగిన కేప్ టౌన్ టెస్టులో బాల్ టాంపరింగ్ ఆరోపణలపై పట్టుబడ్డ డేవిడ్ వార్నర్, స్మిత్ లు 2018 సంవత్సరంలో కెప్టెన్సీ నుంచి జీవితకాలం నిషేధించబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి శిక్షణ తగ్గించడం జరిగింది.మొన్న జరిగిన వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా టీంకు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు డేవిడ్ వార్నర్.

ఈ టైంలోనే ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ పించ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్డ్ కావడం జరిగింది. ఇలా ఇతను రిటైర్డ్ కావడం వల్ల నెక్స్ట్ కెప్టెన్ ఎవరు ఉండాలి అనే విషయంపై కొన్ని చర్చలు జరిగాయి.

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పై ఫిర్యాదు చేసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఈ విషయంపై కొన్ని సంప్రదింపులు కూడా జరిపింది. తనకు విధించిన శిక్షను సమీక్షించాలని వార్నర్ క్రికెట్ బోర్డుకి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు డేవిడ్ వార్నర్ ఏడాది పాటు ఎలాంటి క్రికెట్ ఆడకూడదని నిషేధించడం కూడా చేసింది.

ప్రస్తుతం ఇతను క్రికెట్ బోర్డుకి పెట్టిన అభ్యర్థనను ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ తిరస్కరించడం జరిగింది. ఈ విషయాన్ని నేను నేరస్తుని కాను అని చాలా గట్టిగా చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్. శిక్ష ను సవాల్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది . జీవితకాలం నిషేధించడం చాలా బాధగా ఉంది. హాస్టల్ లో క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం పై డేవిడ్ వార్నర్ చాలా నిరాశ చెందానని చెప్పుకొచ్చాడు.

ఫిబ్రవరి నెలలో నేను క్రికెట్ బోర్డుకి ఒక విజ్ఞప్తిని విన్నవించుకున్నాను అనే డేవిడ్ వార్నర్ తెలియజేశాడు. ఈ విషయంపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకోకుండా 9నెలల పాటు వాయిదా వేయడం చేసింది. ఆరోన్ పించ్ రిటైర్డ్ అయిన తర్వాత అయినా నా అభ్యర్థనను క్రికెట్ బోర్డు తీసుకొని ఉంటే బాగుండేది.

ఈ విషయంపై నాకు మద్దతు ఇవ్వమని నేను ఎవరిని అడగడం లేదు. కానీ క్రికెట్ బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా నిరాశ చెందాను నీ డేవిడ్ వార్నర్ చెప్పు కొచ్చాడు.

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ తీసుకున్న నిర్ణయం నా ఒక్కడి పైనే కాదు నా కుటుంబ o పై కూడా పడుతుంది. నన్ను కొత్త కెప్టెన్ గా నియమించమని మరోసారి కోరుకుంటున్నాను అని డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకి చెప్పడం జరిగింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button
Exit mobile version