AP ఎయిడెడ్ పోస్టింగ్ లో గందరగోళం
AP ఎయిడెడ్ పోస్టింగ్ లో గందరగోళం
పీడీ, లైబ్రేరియన్ లకు ఫోన్లో కౌన్సిలింగ్
వెబ్ కౌన్సెలింగ్లో కనిపించని ఖాళీలు
ఎయిడెడ్ డిగ్రీ జూనియర్ కళాశాల నుంచి వచ్చిన అధ్యాపకులు పోస్టింగ్ లో గందరగోళం నెలకొంది. డిగ్రీ వ్యాయామ సంచాలకులు (పిడి), లైబ్రేరియన్ లకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించకుండా ఫోన్లో 2, 3 ఐచ్ఛికాలు ఇచ్చి ఎంపిక చేసుకోవాలని చెప్పారు. వారు అడిగిన చోట కాకుండా ఇష్టం వచ్చిన చోట పోస్టింగ్ ఇచ్చారు. ఏడాదిలో పదవి విరమణ పొందే వారిని మహిళలు దూరం చేశారు .వీటిని రద్దుచేసి, కౌన్సిలింగ్ నిర్వహించాలని అధ్యాపకులు కోరుతున్నారు. వెబ్ కౌన్సిలింగ్లో పాల్గొన్న వారికి అన్ని ఖాళీలను చూపించలేదు. గుంటూరు జిల్లాలో 48 మంది ఆంగ్ల అధ్యాపకులు ఉంటే వీరందరికీ ఒంగోల్లో ని 4 ఖాళీలను చూపించారు. రాజనీతి శాస్త్రం వారికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఒక్కటే ఆన్లైన్లో ఉంది. వారు కౌన్సిలింగ్లో ఐచ్ఛికాలు నమోదుకు వెళ్లగా ఖాళీలు కనిపించలేదు. దీంతో వెబ్ కౌన్సిలింగ్ ను రద్దు చేయాలని అధ్యాపకులు కోరుతున్నారు. అన్ని ఖాళీలను చూపించాలని, సీనియార్టీ జాబితాను ప్రకటించాలని అంటున్నార. ఈ సమస్యలపై ఎమ్మెల్సీ లక్ష్మణరావు సాబ్జీ తో కలిసి ఎడిట్ అధ్యాపకులు ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ను కలిశారు.
మంజూరు లేని పోస్టులు జూనియర్ లెక్చరర్లు
ఎయిడెడ్ జూనియర్ కళాశాల లెక్చరర్ పోస్టులు మంజూరు లేని వాటిలో నియమించాలని ఇంటర్ విద్యాశాఖ భావిస్తోంది. దీనిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . పోస్టులు మంజూరు లేనిచట నియమిస్తే తమకు జీతాలు రావంటున్నారు. రాష్ట్రంలో పోస్టులు లేని జూనియర్ కళాశాలలో 84 ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం ప్రిన్సిపల్ మాత్రమే శాశ్వత ఉద్యోగ. గతంలో ఒప్పంద లెక్చరర్లను నియమించగా వీరికి వేతనాలు ఇవ్వడం కష్టం గా మారితే వారందరినీ పోస్టులు మంజూరు ఉన్న వాటిలోకి బదిలీ చేశారు.