IBPS 4135 PO Posts Notification
IBPS 4135 PO Posts Notification
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టే అటానమస్ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) మేనేజ్మెంట్ ట్రైనీ (ఎంటీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో పీవో/ఎంపీ పోస్టులకు పోటీ పడొచ్చు.
పోస్టులు: ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్మెంట్ ట్రైనీస్
మొత్తం పోస్టుల సంఖ్య: 4135
బ్యాంకుల వారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా – 588,బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర – 400, కెనరా బ్యాంక్ – 650, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ – 620, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ – 98, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ – 427, యూకో బ్యాంక్ – 440,యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -922
అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు : 01-10 – 2020 నాటికి 20 – 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం : ప్రిలిమినరీఆన్లైన్ టెస్ట్, మెయిన్ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ ఆన్లైన్ టెస్ట్
ఎంపిక ప్రక్రియలో తొలి దశ అయిన ప్రిలిమినరీ ఆన్లైన్ టెస్ట్ మొత్తం 100 ప్రశ్నలు – 100 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లీష్ 30 ప్రశ్నలు – 30 మార్కులు, క్వాంబిటేటివ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 ప్రశ్నలు – 35 మార్కులు, రీజనింగ్ ఎలిజిబిలిటీ 35 ప్రశ్నలు – 35 మార్కులకు జరుగుతుంది. పరీక్షా సమయం ప్రతి విభాగానికి 20 నిమిషాలు. ప్రశ్నపత్రాలు ఇంగ్లీష్, హిందీ, మాధ్యమాలలో ఉంటుంది. నెగటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి పొరపాటు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ప్రిలిమినరీ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ కు ఎంపిక చేస్తారు.
మెయిన్ ఆన్లైన్ పరీక్ష
మెయిన్ ఆన్లైన్ పరీక్ష మొత్తం-225 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష ఉంటుంది. మిగతా 25 మార్కులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కు సంబంధించి లెటర్ రైటింగ్ ఎస్సే ప్రశ్నలు ఉంటాయి మెయిన్ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 ప్రశ్నలు మార్కులు ఎకనామిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 మార్కులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 40 మార్కులు ముప్పై ఐదు ప్రశ్నలు 60 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
వంద మార్కులకు ఇంటర్వ్యూ
మెయిన్స్ లో ప్రతిభ చూపిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. మెయిన్స్ లో సాధించిన స్కోరు ఆధారంగా ఇంటర్వ్యూకు అర్హత లభిస్తుంది. మెయిన్, ఇంటర్వ్యూ మార్కులకు 80 20 నిష్పత్తిలో వెయిటేజీ ఇచ్చి తుది జాబితా రూపొందిస్తారు. కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ / ఓబీసీ / పీడబ్ల్యూడీ అభ్యర్థుల కనీసం 35 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 20- 11 – 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 10-11-2021
ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ:04-12- 2021,11-12-2021
ఆన్లైన్ మెయిన్ పరీక్ష : జనవరి 2022
ఇంటర్వ్యూలు : ఫిబ్రవరి / మార్చి 2022
పూర్తి వివరాలకు వెబ్సైట్ :https:/www.ibps.in